Headlines

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ పని చేస్తే రేపే మీ అకౌంట్లోకి రూ.20 వేలు.. | Andhra pradesh Government to Deposit 20000 into Fishermen Accounts Under Matsyakarula Sevalo Scheme


ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా లబ్దిదారులకు అకౌంట్లోకి మే 19న నిధులు విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేలు జమ చేయనుంది. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో వీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చేపల వేటపై నిషేధం అమల్లో ఉండటంతో వీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఎన్నికల సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు అందిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేురకు ప్రస్తుతం విడుదల చేస్తున్నారు.

మత్స్యకారులకు రూ.20 వేలు

నెల్లూరు జిల్లా కావలి మండలంలోని తుమ్మలపెంటలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా మత్స్యకారులకు రూ.20 వేలు విడుదల చేయనున్నారు. లైసెన్స్ డ్ మత్స్యకారులకు రూ.20 వేలు అందనున్నాయి. మత్స్యకారుల బ్యాంక్ అకౌంట్లో వీటిని నేరుగా విడుదల చేయనున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉంటుంది. ఈ సమయంలో చేపలు సంతానోత్పతిలో ఉంటాయి. దీంతో ఈ సమయంలో చేపల వేటకు విరామం ప్రకటిస్తారు. ఈ నిషేధం సమయంలో చేపల వేటను జీవనోపాధిగా ఎంచుకున్నవారికి ఆదాయం ఉండదు. దీంతో మత్స్యకారులకు ప్రభుత్వం రూ.20 వేలు ఆర్ధిక సాయం అందిస్తోంది.

ఈకేవైసీ తప్పనిసరి

అయితే మత్స్యకారుల సేవలో పథకం కింద లబ్ది పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయాలి. ప్రభుత్వం ఈకేవైసీ నిబంధన విధించింది. దీంతో ఈకేవైసీ పూర్తి చేసినవారికి మాత్రమే డబ్బులు జమ చేస్తోంది. లబ్దిదారుల జాబితాలో పేరు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయాలి. లేకపోతే డబ్బులు అకౌంట్లో పడవని ప్రభుత్వం చెబుతోంది. నిధులు అందించే ముందు రోజు వరకు ఈకేవైసీ చేయించుకునే అవకాశం కల్పించారు. ముందు రోజు ఈకేవైసీ పూర్తి చేసుకున్న అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ప్రస్తుతం 90 శాతం మంది ఈకేవైసీ పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *