Headlines

IPL finals : ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం: రజత్ పాటిదార్

Rcb ipl finals 2026

ఐపీఎల్ (H) 2026 ఫైనల్ మ్యాచ్.. ఆదివారం అహ్మదాబాద్

వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bongaluru), గుజరాత్ టైటాన్స్ (Grajanctilition) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించడం తమ బౌలర్ల చేతుల్లోనే ఉందని కెప్టెన్ రజత్ పాటిదార్ (Rovt Randa) అన్నాడు.

. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజత్ పాటిదార్ మాట్లాడాడు.

. ‘పోటీలో నెగ్గాలంటే.. చక్కటి బౌలింగ్ ఎటాక్ ఉండాలి. ఈ పిచ్పి 200, 220 పరుగులు చేయడం తేలిక. కానీ ఆ స్కోర్ను డిఫెండ్ చేసుకోవడం కష్టం. అందుకే బౌలింగ్ దళం సత్తా చాటాలి’ అని పాటిదార్ అన్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ను అతడు కొనియాడాడు. ‘భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు అనుభవమున్న బౌలర్. తుదిపోరులో బౌలింగ్ చేయడం బౌలర్లకు అంత తేలికైన విషయం కాదు. అతడికి తన ప్రణాళికలు, శక్తిసామర్ధ్యాల మీద పూర్తి అవగాహన ఉంది. అదే కీలక పాత్ర పోషించనుంది’ అని రజత్ పాటిదార్ అన్నాడు.

.

. ‘టాప్ బౌలర్లైన భువీ, హేజిలుడ్కు ఇతర బౌలర్ల నుంచీ మద్దతు అవసరం. రసిఖ్ సలామ్ దార్ ఈ విషయంలో జట్టుకు సాయపడ్డాడు. ఇలా బౌలర్ల నుంచి సహాయ సహకారాలు అందడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీరు కేవలం ఒకరిద్దరు బౌలర్లతోనే పోటీలో గెలవలేరు. రసిఖ్ ఈ టోర్నమెంట్లో చక్కటి పాత్ర పోషించాడు. ప్రధాన బౌలర్ల మీద అదనపు భారం లేదు. జట్టంతా అద్భుతంగా ముందుకు సాగుతోంది’ అని పాటిదార్ వివరించాడు.

.

అలాగే చేతివేలి గాయానికి గురైన ఫిల్సాల్ట్ పునరాగమనం గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘ప్రస్తుతం అతడు నెట్స్లో సాధన చేస్తున్నాడు. అయితే తుది జట్టులో అతడికి చోటు గురించి ఇంకా మేం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. వైద్యులు, మేనేజ్మెంట్ అంతా ఏం చెబుతారో చూడాలి’ అని పాటిదార్ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *