Headlines

మూటతో కనిపించిన ఓ వ్యక్తి.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. ఓర్నాయనో..!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో సజీవ పాముల అక్రమ వ్యాపారానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సజీవ పాములను గ్రే మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై నిర్దిష్ట సమాచారం అందడంతో.. అధికారులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి  నిందితుడిని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 17 మే 2026న డీఆర్ఐ, హెచ్‌జెడ్‌యూ సంయుక్తంగా ఒక సీక్రెట్ ట్రాప్ ఆపరేషన్‌ను ప్రణాళికబద్ధంగా అమలు చేశాయి. ఈ క్రమంలో అనుమానిత వ్యక్తిని గుర్తించి, వరంగల్‌లో అడ్డగించారు. తనిఖీల సమయంలో నిందితుడి వద్ద…

Read More

TS EAPCET 2026 Counselling: వారంలో ఈఏపీసెట్‌ 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. నెలాఖరు నుంచే ప్రారంభం | TG EAPCET 2026 Counseling Schedule to be Released in a Week, Check details here

హైదరాబాద్‌, మే 19: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు ఆదివారం (మే 17) విడుదలైన సంగతి తెలిసిందే. ఈఏపీసెట్‌ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుంచి 11 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. తాజా ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయి కావడం విశేషం. ఇంజనీరింగ్‌ విభాగంలో 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా, 1,97,242…

Read More

Telangana EAPCET Results: తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఫలితాలు వచ్చేశాయ్.. ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ లింక్ | Telangana EAPCET Exam results 2026 announced, Download rank card, marks memo online

హైదరాబాద్‌, మే 17: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్) 2026 ఫలితాలు ఆదివారం (మే 17) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా ఫలితాలు వెల్లడించారు. ఈఏపీసెట్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా ఫలితాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తాజా…

Read More

TS EAPCET 2026 Toppers: ఈఏపీసెట్‌లో సత్తా చాటిన హైదరాబాద్‌ కుర్రాడు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే | TS EAPCET 2026 Toppers List: 93.58 pass percentage recorded in Telangana EAPCET exam results

హైదరాబాద్‌, మే 17: జేఎన్టీయూ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు మొత్తం 3లక్షలకు పైగా విద్యార్ధులు రాశారు. పరీక్షలు ముగిసిన 6 రోజులకే ఈఏపీసెట్‌ ఫలితాలు వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 3,01,734 మంది ఈఏపీసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వీరికి 16 టెస్ట్ జోన్లలో 125 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో…

Read More

మేడారం దారిలో వాహనదారులను పలకరించిన అరుదైన అతిథి.. చూశారా దాని రాజసం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో భారీ అడవి దున్నలు కలకలం రేపుతున్నాయి.. ఆ మార్గంలో వెళ్లే బాటసారులను వణికిస్తున్నాయి.. తాజాగా కాటారం నుంచి మేడారం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ అడవి దున్నలు రోడ్డుపై సంచరిస్తూ జనాన్ని పరుగులు పెట్టించాయి.. సాయంత్రం 7 గంటల సమయంలో ఈ అడవి దున్నలు ప్రత్యక్షం అయ్యాయి.. వాహనదారులు భూపాలపల్లి నుంచి కాటారం వస్తున్న క్రమంలో మల్లంపెళ్లి స్టేజి దాటి సుమారుగా రెండు కిలోమీటర్లు దూరం రాగానే అడవిదున్నలు రోడ్డుపై కనిపించాయి….

Read More

రెచ్చిపోతున్న గంజాయి ముఠా.. అర్థరాత్రి విచ్చలవిడిగా దాడులు! | A gang under the influence of marijuana brutally attacked six youths in Mancherial district

మంచిర్యాల, మే 17: మంచిర్యాల జిల్లాలో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి అత్యవసరంగా బయటకి వస్తున్న వారే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతున్నారు‌. ముందుగా గొడవలు పెట్టుకుని కత్తులు, రాడ్లతో దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. అర్దరాత్రి రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ.. అత్యవసరంగా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ముందుగా బెదిరించడం, వినక పోతే దాడులకు పాల్పడటం పరిపాటిగా మారుతోంది. తాజాగా గంజాయి మత్తులో ఓ మూక సృష్టించిన విధ్వంసం సంచలనంగా మారింది….

Read More

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో | Monkey Adopts Orphan Puppy in Khammam, Viral Videos Melt Hearts – Viral Videos in Telugu

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వింత సంఘటన జరిగింది. సహజంగా కుక్కలకు, కోతులకు మధ్య జాతి వైరం ఉంటుంది. కానీ, ఇక్కడ ఒక వానరం మాత్రం ఆ వైరాన్ని మరచి, ఒక అనాథ కుక్క పిల్లను చేరదీసి తన బిడ్డలా సాకుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సత్తుపల్లి పట్టణంలోని కృషి బైపాస్ రోడ్డులో వారం రోజుల క్రితం కోతుల గుంపు సందడి చేసింది. అందులో ఒక కోతి, ఓ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్న కుక్క పిల్లను చూసి ముచ్చటపడింది….

Read More

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ విద్యలో పెను మార్పులు.. ఈ ఏడాది నుంచే అమలు.. | Big Changes in Telangana Intermediate Education, Practical Exams, Internal Marks Revised, New Exam Pattern from 2026 27

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) 2026-27 విద్యా సంవత్సరం నుండి కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు విభజించింది. ఇకపై మొదటి ఏడాదిలో 15 మార్కులు, రెండో ఏడాదిలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అలాగే గణితం, హ్యుమానిటీస్, భాషా సబ్జెక్టులలో…

Read More

అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..! | Tragedy in Nalgonda district, A student went for a swim accidentally drowned in pond

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక సంఘటన మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పులిపలుపుల గ్రామానికి చెందిన కాగిత లక్ష్మణ్ రెండో కుమారుడు కాగిత అఖిల్ (14). అఖిల్ సమీపంలోని…

Read More

పొదుపు దిశగా తెలంగాణ అడుగులు.. సీఎం కాన్వాయ్ తగ్గింపు.. ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’? | ‘Work from Home’ for Government Employees and the IT Sector in Telangana?

దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రభుత్వాల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌పై పడింది. నగరంలో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ప్రతిరోజూ ప్రజా, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. తెలంగాణలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే.. ఇంధన వినియోగం, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే…

Read More