ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు.. అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి! | CM Revanth Reddy lashes Modi government took an autocratic decision regarding cancellation of NEET UG 2026
నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆయన మండిపడ్డారు. ఈ రద్దు నిర్ణయం గతంలో దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్) వంటిదేనని సీఎం అభివర్ణించారు. వ్యవస్థీకృత పేపర్ లీక్‌లు, ప్రభుత్వ…
