Headlines

Peddi latest update:బాక్సాఫీస్ నంబర్లు ముఖ్యమే.. కానీ: రామ్ చరణ్

Peddi latest update : DharaniNewz

‘పెద్ది’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అగ్రకథానాయకుడు రామ్ చరణ్ (Ram Charm). తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. నటీనటుల కెరీర్లో బాక్సాఫీసు వసూళ్ల ప్రాముఖ్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్షన్లు ముఖ్యమే అయినప్పటికీ.. వాటితోనే విజయాన్ని నిర్ణయించలేమని పేర్కొన్నారు.

మంచి బాక్సాఫీస్ నంబర్లు మన తదుపరి సినిమాలను కూడా నిర్ణయిస్తాయి. అవి బాగుంటేనే రాబోయే చిత్రాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే బాక్సాఫీస్ నంబర్లు ముఖ్యమే.. అలా అని కేవలం అవి ఒక్కటే విజయానికి కొలమానం కాదు అని రామ్ చరణ్ అన్నారు.

ఇదిలా ఉండగా.. జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ద’ (Peddi) సినిమాకు ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాగా ఓవర్సీస్ లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 (జీఎస్టతో కలిపి) గా నిర్ణయించింది. అలాగే సినిమా విడుదలయ్యే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *