మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెది చిత్రం జూన్ ప్రపంచవ్యాపంగా విడుదల కానుంది దీంతో ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది రామ్ చరణ్ తో పాటు మూవీ యూనిట్ మొత్తం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ పెద్ది సినిమాను ప్రమోట్ చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరవాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు బుచ్చిబాబు సన చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది పైగా చరణ్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించనుండటంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా స్థాయిని ఆకాశానికి పెంచేసింది.
. ఈ ట్రైలర్ లో చరణ్ యాక్టింగ్, యాక్షన్స్ సీన్స్ ఆడియన్స్ కు పిచ్చెక్కించాయి పల్లెటూరి యువకుడిగా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 8న విడుదలకు సిద్దం అవుతుంది దాంతో ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు తాజాగా పెద్ది సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది. పెద్ది సినిమాకు టికెట్ రేట్స్ పెంచేసింది.
జూన్ 3న రాత్రి 6 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సినిమా విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.80, మల్టీప్లెక్స్ లో రూ. 15 చొప్పున పెంచుకోవచ్చు అలాగే ప్రీమియర్ షోలకు కూడా టికెట్ రేట్ ను ఫిక్స్ చేసింది. ప్రీమియర్స్ కు రూ.680 పిక్స్ చేసింది దాంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమా పై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా. దుమ్ములేపడం ఖాయం అంటూ సెన్సార్ టాక్ వినిపిస్తుంది మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
