‘పెద్ది’పై అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం.
. పెద్ది’పై అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం. రామ్ చరణ్ (Rom loon) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా దీనిపై ఆన్లైన్ వేదికగా అసత్య ప్రచారం చేస్తోన్న ఇద్దరి వ్యక్తులను గుర్తించి వారిపై ఫిర్యాదు చేసింది. గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘పెద్ది’పై (Peddi) ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నట్లు టీమ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆధారాలను సేకరించిన చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన మద్రాసు హైకోర్టు వెకేషన్ బెంచ్ తాజాగా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు (Peddi) ఇంటర్నెట్లో అక్రమంగా అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్ లు కాకుండా చర్యలు చేపట్టినట్లు అయింది. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలోనూ చిత్రబృందం యాక్టివ్‌గా ఉంటూ నిశితంగా పరిశీలించి నెగెటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది (Peddi Release date).
