Headlines

క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే?.. ఇదిగో వీడియో | Kadapa Gas Tanker Accident: Guvvalacheruvu Leak Causes Panic and Traffic Chaos Watch Video


సాధారణంగా మన ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ లీకైతేనే భయంతో పరుగులు పెడతాం. అలాంటిది ఒక పెద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఇంకేమైనా ఉందా.. గుండెలు జారిపోవు. అచ్చం అలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది. గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడడంతో దాని నుంచి గ్యాస్ లీకైంది. అది గమనించిన స్థానికులు భయతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు లీకేజ్‌ను ఆపేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్‌లో ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల కాలంలో ఈ ప్రాంతంలో రెండు గ్యాస్ ట్యాంకర్లు అదుపుతప్పి అడ్డంగా బోల్తా కొట్టాయి. ఈ ఘటన జరిగి 48 గంటల కూడా గడవక ముందే.. సరిగ్గా అదే ప్రాంతంలో మరో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్‌ నుంచి గ్యాస్ లీక్‌ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీంతో భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది లీకేజ్‌ను ఆపేశారు.

అయితే ఆ భారీ ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘటనా స్థలానికి క్రేన్ చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దీంతో ట్రాఫిక్‌లోనే వాహనదారులకు గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. అంతేకాక బెంగుళూరు,తిరుపతి ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. ఇక ఎట్టకేలకు క్రేన్ ప్రమాద స్థలికి చేరుకోవడంతో పోలీసులు, ఫైర్స్ సిబ్బంది కష్టపడి సిలిండర్ లారీలు పైకి లేపి రోడ్డు పక్కకు తొగించారు. అనంతరం ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

ఏది ఏమైనా ప్రమాదాలకు నిలియంగా ఉన్న గువ్వల చెరువు ఘాట్లో ప్రమాద సూచికలను ఏర్పాటు చేయడం ముఖ్యంగా మలుపుల వద్ద కన్ఫ్యూజ్ కావడం వలన ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి.. ఈ ప్రాంతంలో ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదిగో వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *