Headlines

ఎందుకు ఆదిలక్ష్మి ఇలా చేశావ్.. అకస్మాత్తుగా ఫ్లైఓవర్ పై నుంచి దూకింది.. చివరకు.. | Young Woman Dies After Jumps From Tirupati Flyover, Love Failure Angle Suspected


ప్రేమ వైఫల్యమో.. లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఆ యువతి ఒక్కసారిగా దారుణ నిర్ణయం తీసుకుంది.. అకస్మాత్తుగా.. ఫ్లైఓవర్ పై నుంచి దూకి.. ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి గరుడ వారధి ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కరకంబాడి వైపు నుండి లీలా మహల్ సర్కిల్ వైపు వస్తున్న ఫ్లై ఓవర్ పై నుంచి దూకిన యువతి నంద్యాల జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. జూపాడుబంగ్లా పాయ మంచాల కు చెందిన ఆదిలక్ష్మి (24) గా గుర్తించారు.

తిరుపతికి వలస వచ్చిన సాములు అతని చెల్లెలు ఆదిలక్ష్మి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ తిరుపతిలో ఉంటున్నారు. లీలామహల్ సర్కిల్ లోని లేడీస్ హాస్టల్లో ఆదిలక్ష్మి, ఎదురుగా ఉన్న బాయ్స్ హాస్టల్ లో అన్న స్వాములు ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ.. ఆదిలక్ష్మీ.. ఫ్లై ఓవర్ పైనుంచి పడి
ఆత్మహత్యాయత్నం చేసింది.. కింద పడటంతో ఆదిలక్ష్మి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే.. రుయా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మి పరిస్థితి విషమించి ఈ రోజు మృతి చెందింది.

వీడియో చూడండి..

అయితే.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు ఆదిలక్ష్మి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ డేటా ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆదిలక్ష్మీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలి అన్న స్వాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈస్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *