Headlines

Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.. | Fake Currency Fraud: Gang Caught Selling Toy Notes as Fake Currency in Lepakshi


ఒక లక్ష రూపాయలకు 10 లక్షల నకిలీ కరెన్సీ పది లక్షలకు కోటి రూపాయలు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనలు అనేకం చూశాం.. కాని వీళ్ళెవరో మోసగాళ్లకే మోసగాళ్లలా ఉన్నారు. నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ అదే బొమ్మ నోట్లు అంటగట్టి మోసం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒక లక్ష రూపాయలకు బదులుగా 10 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని మోసం చేసి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ ఇచ్చి బురిడీ కొట్టించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లేపాక్షి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన ఐదుగురు నిందితులు ఎవరికైతే నకిలీ కరెన్సీ కావాలో వాళ్లకు టాయ్ కరెన్సీ అంటగట్టి మోసం చేయడం పోలీసుల్ని షాక్‌కు గురి చేసింది. లేపాక్షి మండలం కొండూరు క్రాస్ వద్ద ఈ నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుకున్నారు.

కేటుగాళ్లు ఒక స్కార్పియో వాహనంలో పోలీసుల యూనిఫాం, సంకెళ్లు, లాఠీలు పెట్టుకుని తిరుగుతుండగా అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. నకిలీ కరెన్సీ కావాలని వచ్చే వాళ్ల దగ్గర మొదట డబ్బులు తీసుకుని.. వెంటనే సీన్‌‌లోకి పోలీసులు వస్తున్నారని కంగారు పెట్టి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ అంటగట్టి డబ్బులతో ఉడాయిస్తుంది ఈ ముఠా. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 50 లక్షల టాయ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల వద్ద పోలీసు యూనిఫాం, సంకెళ్లు, డబ్బుల కౌంటింగ్ మెషిన్, స్కార్పియో, లారీని సీజ్ చేశారు. అసలు విషయం ఏంటంటే… నకిలీ కరెన్సీతో వేరే వాళ్లను మోసం చేయాలనుకున్న వారే ఈ టాయ్ కరెన్సీతో మోసపోయారు. వీళ్లెవరో మోసగాళ్లకు మోసగాళ్లులా ఉన్నారు. ఈ ముఠా టాయ్ కరెన్సీతో బాగా ఆడారు కదా.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *