Headlines

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి | Gold and Silver Prices Today: May 28 gold rates in hyderabad, vijayawada, Visakhapatnam


హైదరాబాద్‌, మే 28: అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు క్రూడ్‌ ఆయిల్‌.. ఇటు బంగారం ధరలు పోటాపోటీగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి నేటి పసిడి ధరలు కాస్త ఊరటనిచ్చాయి. బంగారంతో పాటు వెండికీ ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో ధరలు ఎప్పుడెప్పుడు దిగొస్తాయా అని జనాలు ఎదురు చూస్తున్నారు. తేడాది గోల్డ్ రేటు ఏకంగా 70 శాతం వరకు పుంజుకుంది. ఇక వెండి సంగతి సరేసరి. సిల్వర్ రేటు గతేడాది రికార్డు స్థాయిలో 150 శాతం వరకు పెరిగింది. బుధవారం (మే 27) కూడా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇక ఇవాళ (మే 28న) తెలుగు రాష్ట్రాల్లో ఏయే నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

నేటి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము ధర రూ.15,282, 22 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము ధర రూ.14,509, ఇక 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము ధర రూ.11,871 వద్ద పలుకుతుంది. తులం ప్రకారం చూస్తే 24 క్యారెట్ల గోల్డ్‌ తులం రూ. 1,58,280 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల గోల్డ్‌ తులం రూ.1,45,090, 18 క్యారెట్ల గోల్డ్‌ తులం రూ.1,18,710 వద్ద కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మే 28 బంగారం ధరలు ఇవే..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,828, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,509, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,871
  • విజయవాడలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,828, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,509, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,871
  • విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,828, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,509, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,871 గా ఉంది. అమరావతి, గుంటూర్‌, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ వంటి అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మే 28న తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఇలా..

ఇక వెండి ధరలు చూస్తే.. వెండి గ్రాము రూ.284.90 వద్ద ఉంది. కిలో ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతుంది. తులం (10 గ్రాములు) రూ.2,849 వద్ద ఉంది. నిన్నటితో పోల్చితే కిలో వెండి ధర నేటికి రూ.వంద తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి అన్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో రూ.2,89,900, కలకత్తాలో రూ.2,84,900, బెంగళూరులో రూ.2,85,100 వద్ద వెండి ధరలు కొనసాగుతున్నాయి.

ఇందులో నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో రాగి వంటి ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే 22 క్యారెట్ల ఆభరణాలన్నీ 916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధరనే అంతిమంగా బంగారం ప్రియులు ఎక్కువగా గమనిస్తుంటారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగాఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. అక్కడ తగ్గినా ఇక్కడా తగ్గుతుంది. అలాగే డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *