కోవూరు, 27 జూన్ 2026: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోవూరులో ‘చాయ్ విత్ జనసైనిక్’ పేరుతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక యువతతో కలిసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గదిరాజు జీవన్ కృష్ణ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలపై పోరాడే విధానాలను యువతకు వివరించారు. యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు:
గదిరాజు జీవన్ కృష్ణ (జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు)
నక్కల శివ కృష్ణ (జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్)
చక్క సులం బాబు (కోడవలూరు మండల అధ్యక్షులు)
చీరమణ సురేష్ బాబు (బుచ్చి జనసేన నాయకులు)
చెరుకూరు దిలీప్ (కోవూరు నియోజకవర్గ ఐటీ ఇన్చార్జ్)
వీరితో పాటు పిల్లేలా సురేంద్ర, మానేపల్లి చైతన్య, దందూరు కళ్యాణ్, దుర్గం సందీప్, కోళ్ల వెంకటేశ్వర్లు, అంచాల శరత్, ముక్కోటి అమరనాథ్, వెలిశెట్టి తనుష్ చంద్ర తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
