Headlines

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం | Telugu States Brace for Severe Heatwave as Temperatures Cross 45°C video tv9d


తెలుగు రాష్ట్రాల్లో అసలుసిసలైన ఎండాకాలం మొదలవబోతోందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. వేసవికాలం మొదలైనప్పటి నుండి మధ్యాహ్నం ఎండలు… ఉదయం, సాయంత్రం చల్లని వాతావరణం ఉంటూ వస్తోంది. కొన్నిచోట్ల వర్షాలు కూడా కురవడంతో వాతావరణం చల్లబడేది. కానీ ఇకపై ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని… వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఏపీలో మరో వారం పాటూ భానుడి భగభగలు కొనసాగనున్నాయి. మంగళవారం నుంచి ఈనెల 24 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏకంగా 45 డిగ్రీలు దాటే ప్రమాదముంది. సోమవారం నాడు 21 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఎండకు తోడు వేడిగాలులు వీయవచ్చని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. చల్లదనం కోసం లస్సీ, మజ్జిగ కొబ్బరిబొండాలను తీసుకుంటున్నారు. అటు కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎండల దాటికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 35 డిగ్రీలున్నా.. సాయంత్రం వరకు 40 డిగ్రీల ఎండ తీవ్రత నమోదు అవుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్యా అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. మరో వారం పాటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండలు ఉన్నా.. పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కూడా లేకపోలేదు. సోమవారం పలు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. తెలంగాణలో క్రమక్రమంగా ఉష్ఱోగ్రతలు పెరుగుతాయని… 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలు ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు రికార్డు స్థాయిలో మండుతుండటంతో వాతావరణ శాఖ అధికారులు జిల్లాను ‘రెడ్ జోన్’గా ప్రకటించారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండటంతో, ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా జనం బయటకు రావడానికి భయపడుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్‌, కొమురంభీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మరో నాలుగైదు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ?? ఇండియాలో వేగంగా పెరుగుతున్న DINK కల్చర్‌

భోజనం ముందు రెస్టారెంట్లలో నో ఫోన్.. నో స్క్రోల్‌ నిబంధన

ఆలయంలో వింత ఆచారం.. భక్తులకు ఉచితంగా డబ్బులు పంపిణీ

పోస్ట్ చూడగానే వ్యూస్‌ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు

తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *