Headlines

మధురఫలం.. విషపూరితం.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు | Chemical Ripened Mangoes Flood Markets: Health Concerns Rise Over Artificially Colored Fruits video tv9d


సమ్మర్‌ సీజన్‌ వచ్చిందంటే అందరి ఫేవరెట్‌ ఫ్రూట్‌ మామిడి పండ్లే.. పాత రోజుల్లో ఇంటికి ఎవరైనా మామిడి పండ్లు తెస్తే ఆ వాసన పక్కింటి వరకూ కొట్టేది. ఇప్పుడు మామిడి పండు వాసనే మర్చిపోయారు జనం. రంగు మాత్రం అదిరిపోతుంది. .. కానీ రుచి మాత్రం శూన్యం. మార్కెట్‌లోపసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్న పండ్ల వెనుక అసలు ఏం జరుగుతోంది. పండ్లు చూస్తే పైకి సహజంగా మగ్గిన మామిడిపండ్లలా కనిపిస్తాయి… కానీ వాటిని పండించిన విధానం మాత్రం వేరే. విజయవాడ మామిడి పండ్ల మార్కెట్ వెనుక భారీ కెమికల్ దందా నడుస్తోంది. చెట్టుపైన సమయానుసారం మగ్గాల్సిన మామిడికాయలను… గోదాముల్లో చైనా రసాయనాలతో గంటల్లోనే పసుపురంగులోకి మార్చేస్తున్నారు. రాత్రివేళ గోదాముల్లో మామిడి కాయలను పెద్ద ఎత్తున నిల్వ చేసి… రసాయనాల మధ్య కప్పి ఉంచుతున్నారు. తెల్లారేసరికి అవే మామిడి కాయలు సహజంగా మగ్గిన పండ్లుగా మారిపోతున్నాయి. అంతే నిగనిగలాడుతూ మార్కెట్‌కు చేరుతున్నాయి. బయటకు ఆకర్షణీయంగా కనిపించే ఈ పండ్లు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. మామిడిపండ్ల రంగు, మెరుపు చూసి కొనుగోలు చేస్తున్న ప్రజలకు అసలు నిజం తెలియడం లేదు. సహజంగా మగ్గిన పండ్లకు ఉండే వాసన, రుచి, నాణ్యత ఈ కెమికల్ పండ్లలో కనిపించడం లేదు. అయినా మార్కెట్‌లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి. వైద్యులు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలతో మగ్గించిన పండ్లు తింటే కడుపునొప్పి, వాంతులు, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు మామిడి పండు వాసనే వేరుగా ఉండేదని, ఇప్పుడు రంగు మాత్రమే ఉంది రుచి ఉండటం లేదంటున్నారు వినియోగదారులు. లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆశతో… సహజ ప్రక్రియను పక్కనపెట్టి రసాయనాల దారిని ఎంచుకుంటున్నారు. ఇక్కడ అధికారుల తనిఖీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పచ్చని పండ్లు గంటల్లో పసుపురంగులోకి మార్చడానికి చైనా కెమికల్స్‌ వాడుతున్నారని, ఈ పండ్లను ప్రజలు కొనడం మానేస్తే వ్యాపారులు కూడా దారికి వస్తారని వినియోగదారులు అంటున్నారు. ఒకప్పుడు మామిడి సీజన్ అంటే ప్రజలు ఆనందంగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు అదే మామిడి పండు భయాన్ని పెంచుతోంది. మార్కెట్‌లో కనిపిస్తున్న ప్రతి మెరిసే పండు వెనుక రసాయనాల ముప్పు దాగి ఉందన్న అనుమానాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కెమికల్ మామిడి దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!

Air India: విమాన ప్రయాణికులకు షాక్‌.. 1,200 విమానాలు రద్దు

ఇంట్లో బంగారం దాచుకున్న వారికి బంపర్ ఆఫర్.. 10 గ్రాములున్నా లాభమే

ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం.. ఉప్పు నుండి ఉక్కు వరకు రేట్లు డబుల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *