Headlines

Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే.. | Know Trisha Krishnan Remuneration For Suriya Karuppu Movie

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. ‘కరుప్పు’ చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్…

Read More

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డికి ఒక్క మేసేజ్ చేశా.. 5 లక్షలు అకౌంట్లో వేసాడు.. హీరోయిన్..

టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుండి ప్రేమ లభించకపోవడం, మానసిక గాయాల (ట్రామా) కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల వెన్నెముక వంకరపోయిందని, ఆటోఇమ్యూన్ కండిషన్ బారిన పడినట్లు తెలిపారు. జంక్ ఫుడ్ తినని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా, యోగా ఛాంపియన్‌గా ఉన్నా తన ఆరోగ్యం ఎందుకు పాడైందని ఆమె ప్రశ్నించుకున్నానని తెలిపారు….

Read More

ప్రేమ కోసం కన్నవారి ఇంటికే కన్నం.. ప్రియుడితో కలిసి తండ్రిని లూటీ చేసిన కూతురు! | Uttar pradesh: high profile robbery in brass trader house expose in moradabad, daughter and her lover arrested

సంచలనం సృష్టించిన రూ. 1.3 కోట్ల భారీ దోపిడీ కేసును ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. నాగఫణి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హైప్రొఫైల్ క్రైమ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఇత్తడి వ్యాపారి సొంత కుమార్తె అని తేలడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ప్రియుడితో కలిసి ఆమె ఈ వికృత కుట్రకు తెరలేపినట్లు విచారణలో వెల్లడైంది. మే 11వ తేదీ రాత్రి, మొరాదాబాద్‌ జిల్లాలోని నాగఫణి పోలీస్ స్టేషన్…

Read More

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంచలనం.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ! | Delhi high court justice swarana kanta sharma initiates contempt proceedings against arvind kejriwal and other aap leaders

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (లిక్కర్) కేసు విచారణలో అత్యంత నాటకీయ, కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు (Recusal) ఆమె అధికారికంగా ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై, న్యాయవ్యవస్థపై జరిగిన తీవ్ర దుష్ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు, కోర్టు ధిక్కారణ చర్యల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. తాను…

Read More

పొదుపు దిశగా తెలంగాణ అడుగులు.. సీఎం కాన్వాయ్ తగ్గింపు.. ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’? | ‘Work from Home’ for Government Employees and the IT Sector in Telangana?

దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రభుత్వాల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌పై పడింది. నగరంలో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ప్రతిరోజూ ప్రజా, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. తెలంగాణలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే.. ఇంధన వినియోగం, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే…

Read More

Andhra Pradesh: ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. నో వెహికల్ డే.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. | AP Chandrababu Govt Announces ‘No Vehicle Day’ and Work From Home Measures to Promote Fuel Savings

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో పొదుపు బాట పట్టింది ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మనదేశం-మన బాధ్యత పేరుతో పలు నిర్ణయాలను ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా వనరుల ఆదాపైనే చర్చ జరిగింది. కాన్వాయ్‌ల తగ్గింపుతో సరిపోదన్న ముఖ్యమంత్రి మరిన్ని పొదుపు చర్యలను సూచించారు. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటిద్దామని, కొన్ని రోజులు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎమ్మెల్యేలు,…

Read More

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు | AP and TS Weather Update: Heatwaves, Rains, Monsoon Forecast Protect Yourself from Heatstroke video tv9d

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఎండల తీవ్ర నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు ,రాయలసీమ ప్రాంతంలో వర్షాల…

Read More

AP PGECET 2026 Result: ఏపీ పీజీఈసీఈటీ-2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..! | AP PGECET 2026 results out, check how to download rank card, merit list, released by Minister Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసీఈటీ (AP PGECET)-2026 పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు గురువారం (మే 14) సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ఈ ఏడాది ఏపీ పీజీఈసీఈటీ పరీక్షకు మొత్తం 9,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 9,320 మంది…

Read More

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్‌లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు.. | AP Government Sanctions 895 New Pensions under NTR Bharosa scheme for Chronic Disease Patients

ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పేదలు వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు….

Read More