Headlines

మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? ఇదిగో తాజా వెదర్ అప్‌డేట్


మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? ఇదిగో తాజా వెదర్ అప్‌డేట్

తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొనసాగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటిపూట ఎండలు మండిపోతున్నాయి.. ఇక రాత్రి పూట ఉక్కపోత ఎండాకాలన్ని తలపిస్తోంది. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర అండమాన్ సముద్రంలో అభివృద్ధి చెందుతున్న ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాబోయే 3-4 రోజుల్లో బలపడి, పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరాల వైపు కదలవచ్చని అంచనా వేసింది. బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలా ఉండగా, కొన్ని వాతావరణ నమూనాలు ఇది బుధవారం నాటికి గాలులతో కూడిన తుఫానుగా మారవచ్చని సూచిస్తుండగా, మరికొన్ని ఇది అల్పపీడనంగానే కొనసాగుతుందని అంచనా వేస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత అవసరమని.. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు:

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *