మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? ఇదిగో తాజా వెదర్ అప్డేట్
తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొనసాగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటిపూట ఎండలు మండిపోతున్నాయి.. ఇక రాత్రి పూట ఉక్కపోత ఎండాకాలన్ని తలపిస్తోంది. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర అండమాన్ సముద్రంలో అభివృద్ధి చెందుతున్న ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం…
