Headlines

Rajamouli : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం ఆమె డెడికేషన్ సిన్సియారిటీ బాగా నచ్చుతాయి. రాజమౌళి

Varanansi Oplus_16908288

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి టాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కేవలం తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాకుండా, యావత్ భారతీయ సినిమా మార్కెట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారణాసి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి

. తెలుగు చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన. ఎంతో మంది నటీనటులతో పనిచేశారు. అయితే ఆయనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ ఎవరనే విషయంపై గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ టాక్ షోలో యాంకర్ అడిగిన రాజమౌళి సమాధానమిస్తూ తన వ్యక్తిగత ఇష్టాలను పంచుకున్నారు.

. ఇండస్ట్రీలో మీ ‘బెస్ట్ ఫేవరెట్’ హీరోయిన్ ఎవరని ప్రశ్నించగా రాజమౌళి ఏమాత్రం తడబడకుండా అనుష్క శెట్టి పేరు చెప్పారు హీరోయిన్లలో నాకు అనుష్క అంటే చాలా ఇష్టం ఆమెలోని సిన్సియారిటీ, డెడికేషన్ ప్రొఫెషనలిజం నాకు బాగా నచ్చుతాయి’ అని రాజమౌళి వివరించారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు’ సినిమాలో అనుష్క కథానాయికగా నటించగా ఆ తర్వాత ‘బాహుబలి సిరీస్లో దేవసేనగా ఆమె చేసిన నటన యావత్ భారతదేశాన్ని మెప్పించింది.

అనుష్కతో పాటు ‘మగధీర’లో నటించిన కాజల్ ‘మర్యాద రామన్న చిత్రాల్లో నటించిన సలోని గురించి కూడా రాజమౌళి ప్రస్తావించారు. అనుష్కకు ఉన్నటువంటి ప్రొఫెషనలిజంతో పాటు సలోని నటన యాక్టింగ్ కూడా తనకు ఎంతో నచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు?” అని ప్రశ్నించగా, రాజమౌళి తనదైన శైలిలో చమత్కరించారు. ‘నా ఫేవరెట్ హీరో ఎవరో పబ్లిక్గా చెప్పేంత అమాయకుడిని కాదండి’ అంటూ నవ్వేశారు

ఇండస్ట్రీలో అందరు హీరోలతో సినిమాలు చేయాల్సి ఉంటుందని అలా ఎవరిదైనా ఒకరి పేరు చెబితే వచ్చే ఇబ్బందులను సున్నితంగా దాటవేస్తూ ఆయన ఇచ్చిన సమాధానానికి యాంకర్ సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. తన సినిమాల ఎంపికలోనూ నటీనటుల అంకితభావాన్ని ఎక్కువగా నమ్ముతారు ఒక నటుడి నుండి ఎలాంటి నటనను రాబట్టాలో ఆయనకు బాగా తెలుసు అందుకే ఆయన చిత్రాల్లో నటించిన ప్రతి ఒక్కరూ తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు.

. ఒక సాధారణ కథను కూడా విజువల్ వండర్గా మార్చగల అద్భుతమైన ప్రతిభ రాజమౌళి సొంతం. నేడు ఆయన కేవలం టాలీవుడ్ దర్శకుడు మాత్రమే కాదు భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దార్శనికుడు కోట్లాది మంది అభిమానులు ఆయన తదుపరి చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *