Headlines

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Monsoon and Weather Update: Rain Alert Along With Heatwave in Telugu States


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కి.మీ. ఎత్తులో, ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి లక్షద్వీప్, ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది.

నిన్నటి ద్రోణి ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్‌పై ఉన్న ఆవర్తనం నుండి ప్రారంభమై, తూర్పు మధ్యప్రదేశ్ – విదర్భల మీదుగా ఉత్తర ఉత్తరప్రదేశ్‌లోని మధ్య భాగాల నుండి ఉత్తర తెలంగాణ వరకు, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై, సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ. ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం (దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని) నుండి కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఆవర్తనం వరకు విస్తరించి ఉన్న నిన్నటి ద్రోణి — సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తుల మధ్య — ఇప్పుడు బలహీనపడింది.

వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు – (Weather Forecast) ఈ కింది విధంగా ఉన్నాయి.. బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు – ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం: బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

రాయలసీమ :- బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక:- రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *