Headlines

ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వచ్చే 3రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో | Mixed Weather in Telugu States: IMD Predicts Heatwave Along With Rains in Andhra Pradesh, Telangana


తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. మాడు పగిలే ఎండలతో పాటు.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం, 6° ఉత్తర అక్షాంశం/79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం/85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం/90° తూర్పు రేఖాంశం, 13.5° ఉత్తర అక్షాంశం /95° తూర్పు రేఖాంశం, 15.5° ఉత్తర అక్షాంశం /98° తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి – ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు మే 26వ తేదీ నాటికి 4 రోజులు ముందు లేదా 4 రోజులు తరువాత కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది.

వీటితోపాటు ద్రోణి/గాలుల అంతరాయం, పశ్చిమ విదర్భ, దాని పరిచర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, మరాఠ్వాడా, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-

ఆదివారం, సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక:- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాంలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు లో గణనీయమైన మార్పు లేదు. ఆ తరువాత 3 రొజుల్లో 2 -3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమముగా పెరిగే అవకాశముంది. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం నిన్న సాయంత్రం బలహీనపడింది. రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)

ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *