Andhra Weather: హమ్మయ్య.. మండే ఎండల్లో చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ | Monsoon Advances Further; Rains, Thunderstorms and Strong Winds Likely in Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్…
