Headlines

Weather Report: ముంచుకొస్తున్న నైరుతి.. ఏపీ, తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో.. | Rain Alert Issued for Andhra Pradesh and Telangana for Next Three Days


ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక గురువారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఒడిస్సా కోస్తా తీరం వరకు కొనసాగిన ద్రోణి.. ఈరోజు వాయువ్య ఉత్తరప్రదేశ్ నుండి తూర్పు ఉత్తర ప్రదేశ్ ఛత్తీస్గడ్ మీదుగా అంతర్గత ఒడిస్సా ప్రాంతంలో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

తెలంగాణకు కూల్ న్యూస్

ఇక మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది. వీటి ప్రభావంతో ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావణ కేంద్రం పేర్కొంది.

ఏపీకి వర్షసూచన

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులకు అవకాశముంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది . రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *