సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు: ఎమ్మెల్సీ నాగబాబు | MLC Naga Babu Lays Foundation To Sirivennela Memorial Park In Anakapalle, Details Inside
ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి చెంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి అని రాష్ట్ర శాసనమండలి సభ్యులు కె. నాగబాబు తెలిపారు. ఆయన ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్‌లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సిరివెన్నెల స్మృతివనం’కు నాగబాబు బుధవారం (మే 20) శంకుస్థాపన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ..’…
