Weather Report: సెగలు కక్కుతున్న భానుడు.. ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ సమయంలో జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గరిష్ట స్థాయిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి రికార్డు సృష్టిస్తు్న్నాయి. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న నాలుగురోజులు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఓ ప్రకటన జారీ చేసింది. మే 21న పార్వతీపురంమన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో 45°C నుంచి 47°C డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. అంచనాలు…
