రన్నింగ్ ట్రైన్‌లో విలువైన వస్తువులు మాయం.. పోలీసుల ఆపరేషన్‌లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..! | A railway official caught by the police while committing thefts on trains in Kurnool District
రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి రైళ్లలో ఉచితంగా, తరచుగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రజల సేవకు…
