Headlines

Andhra News: ఇలా కూడా మోసం చేస్తారా? గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే షాక్ | Kurnool Gold Scam: Women Lose Gold Chains to Conman Offering Free Jewelry Polishing in Andhra Pradesh


కర్నూలు, జూన్‌ 11: కొండపేటకు చెందిన పద్మావతి, చంద్రకళ లు వరుసకు వదిన మరదలు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి “కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం బంగారు వెండి ఆభరణాలు ఇస్తే మీ ముందే ఫ్రీగా మెరుగు పెట్టించి తల తల మెరిసేలా చేస్తాం” అంటూ నమ్మబలికాడు.

అయితే ఆ మహిళలు మొదట తమకు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ కేటుగాడు మీ కళ్ళ ముందే మెరుగు పెట్టి ఇస్తానంటూ పదేపదే చెప్పడంతో చంద్రకళ తన వెండి పట్టి ఇవ్వగా మెరుగు పెట్టి ఇచ్చాడు. దీంతో నమ్మకం కుదిరిన ఆమె తన మెడలోని రెండున్నర తులాల తాళి చైన్ మెరుగుపట్టేందుకు ఇచ్చింది. ఆ కేటుగాడు చంద్రకళ తాళి చైన్ కు మెరుగుపడుతూనే.. పక్కనే ఉన్న పద్మావతి మహిళకు చెందిన రెండు తులాల తాళి చైన్ కూడా పెరుగుపడతానంటూ ఇప్పించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో కొద్దిసేపు వివిధ రకాల కెమికల్స్ పౌడర్లు కలిపి తాళి చైన్లకు మెరుగు పెడుతున్నట్లుగా ఆ దుండగుడు నటించాడు. అనంతరం ఆ తాళి చైన్లను వారి ముందరే పసుపు రంగు ద్రావణంలో వేసి కొద్ది సమయం తర్వాత తీసుకోవాలని చెప్పి ఆ కేటుగాడు అక్కడి నుంచి ఉదయించాడు. కొద్ది సమయం తర్వాత తాళి చైన్లను పసుపు నీటి ద్రావణంలో చూసిన ఆ మహిళలు ఖంగు తిన్నారు. రెండు తాళి చైన్ల పరిమాణం సగానికి పైగా తగ్గిపోవడంతో పాటు బంగారు చైన్లు తంటలు తుంటలుగా ఉండటంతో మోసం జరిగిందని తెలుసుకుని లబోదిబోమంటూ ఆ మహిళలు కోడుమూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *