Headlines

పాతబస్తీలో మహిళ దారుణ హత్య.. బట్టల దుకాణంలో కత్తితో దాడి.. కారణం ఏంటంటే.. | Hyderabad Old City Woman Murdered in Chaderghat; Love Affair Suspected


పాతబస్తీలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఆజంపురాలోని సహీఫా మసీదు పక్కన ఉన్న మన్‌హా హోల్‌సేల్ బట్టల దుకాణంలో పనిచేస్తున్న చంచల్‌గూడకు చెందిన తహెరా బాను (35) హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు

కత్తితో దాడి.. ప్రాణాలు కోల్పోయిన మహిళ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తహెరా బానుపై మహమ్మద్ ఇబ్రహీం కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నిందితుడు కూడా అదే దుకాణంలో పనిచేసినట్లు విచారణలో తేలింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఉండగా, ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విభేదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

అయితే, ఇద్దరి మధ్య ఏ విషయంలో విభేదాలు తలెత్తాయి? ఘటనకు ముందు ఏదైనా గొడవ జరిగిందా? హత్యకు ముందస్తు ప్రణాళిక ఉందా? అనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు

ఇవి కూడా చదవండి



ప్రేమ వ్యవహారమే కారణమా? మరిన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు

ఈ ఘటనలో ప్రేమ వ్యవహారం ప్రధాన కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇదే తుది కారణమని నిర్ధారించలేం. నిందితుడు, మృతురాలి మధ్య గతంలో ఉన్న సంబంధాలు, వారి మధ్య జరిగిన సంభాషణలు, ఘటనకు దారితీసిన పరిస్థితులను పోలీసులు అన్ని కూనాల్లో విచారిస్తున్నారు

అలాగే, ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఎవరైనా ఉన్నారా? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? సీసీటీవీ దృశ్యాల్లో ఏమైనా కీలక ఆధారాలు లభించాయా? అనే అంశాలు కూడా దర్యాప్తులో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి కీలక ఆధారాలను సేకరించారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మహమ్మద్ ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే, ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *