Headlines

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భారీగా ఉద్యోగాలు | BSNL JTO Recruitment 2026 Notification for 100 Junior Telecom OfficerJobs, Apply oline


కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ (టెలికాం) కేడర్‌లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 100 జూనియర్ టెలికాం ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్‌ 4, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

BSNLలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో జూనియర్ టెలికాం ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీఈ, లేదా ఎంఎస్సీ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 3వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు ఉండాలి. నిబంధనల మేరకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 3, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.1,000 చొప్పున చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.16,400 నుంచి రూ.40,500 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 4, 2026 నుంచి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 3, 2026 వరకు
  • దరఖాస్తు సవరణ తేదీ: జులై 4 నుంచి 11 వరకు
  • రాత పరీక్ష తేదీ: ఆగస్ట్‌ 2026లో

BSNLలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *