రోజుకు దాదాపు 16 టన్నుల బియ్యం: రోజూ లక్షలాది మందికి భోజనం సమకూర్చేందుకు టీటీడీ నిత్యం భారీ స్థాయిలో ముడిసరుకులను వినియోగిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 15,788 కిలోల (15.8 టన్నుల) బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు వాడుతున్నారు. వీటితో పాటు నిత్యం 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండుమిర్చి, 209 కిలోల ధనియాలు, సుమారు 4,375 కొబ్బరికాయలను అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు.
