Headlines

NEET UG 2026 paper leak: హమ్మ కులకర్ణీ.. ‘నీట్’గా ఎంత పని చేశావ్! NTA ఇంటి దొంగ వీడే | CBI arrests ‘kingpin’ of NEET UG 2026 leak: Chemistry teacher Kulkarni who worked with NTA, leaked paper in Pune


హైదరాబాద్‌, మే 15: నీట్-యుజి (NEET-UG) 2026 పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి సాధించింది. పుణెలో లీకేజీ సూత్రధారి, కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కుల్కర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీకి అసలు మూలం కుల్కర్ణియేనని సీబీఐ తేల్చింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కుల్కర్ణిని పుణెలో CBI అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్టీఏ (NTA) పరీక్ష ప్రక్రియలో ఉంటూనే కుల్కర్ణి పేపర్ అవుట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు ముందుగానే ప్లాన్ వేశాడు. ఏప్రిల్ చివరి వారంలోనే విద్యార్థులను పోగుచేసి ఇంట్లోనే స్పెషల్ క్లాసులు నిర్వహించడం ప్రారంభించాడు. ప్రశ్నలు, ఆప్షన్లు, జవాబులతో సహా విద్యార్థులకు డిక్టేట్ చేశాడు. మే 3న జరిగిన అసలు పరీక్షా పత్రంతో కులకర్ణి చెప్పిన ప్రశ్నలు 100% మ్యాచ్ అయ్యాయి.

మనీషా వాఘ్మరే సాయంతో విద్యార్థులను వేటాడిన కుల్కర్ణి.. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఈ కేసులో ఇప్పటికే మనీషా అరెస్ట్ అయ్యింది. దేశవ్యాప్తంగా సీబీఐ మెరుపు దాడులు.. కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం చేసింది. ఫోరెన్సిక్ పరీక్షకు నిందితుల మొబైల్ ఫోన్లు.. నెట్‌వర్క్ గుట్టు విప్పే పనిలో సీబీఐ నిమగ్నమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7గురు నిందితుల అరెస్ట్ అయ్యారు. జైపూర్, గురుగ్రామ్, నాసిక్ లలో దాడులు నిర్వహించింది. ఐదుగురు నిందితులకు 7 రోజుల పోలీసు రిమాండ్.. ఇద్దరిని ఢిల్లీకి తరలిస్తున్న సీబీఐ.

మే 12న విద్యా మంత్రిత్వ శాఖ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. పైసా పైసా వసూల్.. పేపర్ లీక్ వెనుక ఉన్న మధ్యవర్తులపై సీబీఐ ఫోకస్ చేస్తుంది. రిటైర్డ్ ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్న CBI.. కోచింగ్ సెంటర్ల టీచర్లు, సిబ్బందిని విచారిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *