Headlines

Crocodile: నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందో తెలుసా? | A 9 Foot Giant Crocodile Approached a Sleeping Father—What Happened Next?


Crocodile: గొర్రెల మందను మేపేందుకు వెళ్లిన ఆ కాపరికి ఊహించని ప్రమాదం ఎదురైంది. ప్రశాంతంగా సాగుతున్న అతడి రోజులో ఒక్కసారిగా కలకలం రేగింది. క్షణక్షణం భయంతో గడుపుతూ ప్రమాదం నుంచి బయటపడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలో గొర్రెల మందలను మేపుకుంటూ జీవనం సాగించే కాపరులు చాలామందే ఉన్నారు. నిత్యం మాదిరిగానే గొర్రెలను మేపేందుకు వెళ్లిన ఓ కాపరికి మొసలి రూపంలో ముప్పు ఎదురైంది. రామచంద్రయ్య, ఆయన కుమారుడు కురుమూర్తి ఇద్దరు గొర్రెలను మోపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దమందడిలో ఎర్ర కుర్మయ్య పొలం వద్ద రాత్రి గొర్రెల మందని నిలిపారు. అక్కడే తండ్రి, కొడుకులు ఇద్దరు నిద్రించారు. అర్థరాత్రి దాటిన తర్వాత గొర్రెల మంద వద్ద నిద్రిస్తున్న రామచంద్రయ్య సమీపానికి ఓ భారీ మొసలి వచ్చింది. అయితే మొసలిని గమనించిన కుక్కలు మొరగడం ప్రారంభించాయి. కుక్కల అరుపులకు కుమారుడు కురుమూర్తి నిద్ర లేచి చూసేసరికి నిద్రలో ఉన్న తండ్రి రామచంద్రయ్య వద్దకు చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన కురుమూర్తి తండ్రిని నిద్రలేపి పక్కకు లాగాడు. తృటిలో మొసలి దాడి నుంచి తప్పించుకున్నారు.

ఇక విషయాన్ని స్థానిక ఎస్సై జలంధర్ రెడ్డికి తెలియజేయడంతో సాగర్ స్నేక్ సొసైటీకి చెందిన కృష్ణ సాగర్, అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉదయం ఇరువురు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రామస్థుల సహకారంతో 9 అడుగులు, 270 కిలోల బరువున్న భారీ మొసలి ని తాళ్ళతో బంధించారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో కృష్ణ నది తీరం వద్దకు తీసుకెళ్లి అక్కడ సురక్షితంగా వదిలేశారు.

గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగించే వారికి వాటి సంరక్షణే ప్రధాన జీవనాధారం. ప్రతిరోజూ పొలాలు, పచ్చిక బయళ్లు, నీటి వనరుల సమీపంలో తిరగాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణులు ఎదురైతే అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యం. మొసలి నుంచి తప్పించుకున్న ఈ ఘటన కాపరులు ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తుచేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *