Headlines

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. కేవలం గంటన్నరలో చెన్నై, బెంగళూరుకు..


Andhra Pradesh: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. కేవలం గంటన్నరలో చెన్నై, బెంగళూరుకు..

ఏపీ ప్రజలకు మరో శుభవార్త. రాష్ట్రం మీదుగా అనేక ఎక్స్‌ప్రెస్ హైవేలు వెళుతుండగా.. త్వరలో మరో ఎక్స్‌ప్రెస్ హైవే కూడా అందుబాటులోకి రానుంది. అదే చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే. ప్రస్తుతం ఈ హైవే పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. త్వరలోనే దీనిని వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడును ఈ హైవే అనుసంధానం చేయనుంది. ఏపీ నుంచి కర్ణాటక వరకు 85 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు అటవీ మార్గం నుంచి ఇది వెళుతుంది.

258 కిలోమీటర్ల హైవే

ఈ హైవే 258 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు రూ.17,930 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశలో ఉన్నాయి. కేవలం ఏపీ పరిధిలోని మొగిలి ఘాట్‌లో 7 కిలోమీటర్ల మేుర, పలమనేరు వైపు గడ్డూరు దగ్గర 3 కిలోమీటర్ల మేర పనులు మిగిలి ఉన్నాయి. మరో ఐదు నెలల్లో ఈ పనులు కూడా పూర్తి అవుతాయని తెలుస్తోంది. పలమనేరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు అటవీ ప్రాతం ఉండటంతో జంతువులకు హాని కలగకుండా అండర్ పాస్ లు నిర్మిస్తున్నారు. ఎనుగుల కోసం ఈ అండర్ పాస్ ల నిర్మాణం జరుగుతోంది. ఏపీ, కర్ణాటక మధ్య ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో వాటి కోసం అండర్ పాస్ లు నిర్మిస్తున్నారు. దాదాపు 12 అండర్ పాసుల నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే వీటి పనులను పూర్తి చేయనున్నారు. దాదాపు పనులన్నీ తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే ప్రారంభించే అవకాశముంది. ఇది పూర్తయితే పలమనేరు నుంచి గంటన్నల్లోనే చెన్నై, బెంగళూరుకు చేరుకోవచ్చు.

ఏపీలో 65 కిలోమీటర్ల హైవే

ఏపీ పరిధిలో దాదాపు 65 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. గతంలో పలమనేరు నుంచి బెంగళూరు వెళ్లాలంటే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది. కానీ ఈ హైవే పూర్తయితే కేవలం గంటన్నర వ్యవధిలోనే బెంగళూరుకు చేరుకోవచ్చు. అలాగే చెన్నైకు కూడా గంటన్నర వ్యవధిలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నై మధ్య 6 గంటల సమయం పడుతుంది. ఇది అందుబాటులోకి వస్త గంటన్నరల్లోనే చేరుకోవచ్చన్నమాట. అలాగే ఈ హైవే వల్ల ప్రయాణ చెన్నై-బెంగళూరు మధ్య 75 శాతం తగ్గుతుంది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఈ హైవే నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో అవసరమైతే 8 వరుసలుగా మారస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *