Headlines

అచ్చం సినిమాల్లో మాదిరి.. నడిరోడ్డుపై తలకిందులైన ఆటో.. వామ్మో వీడియో చూశారా..? | Srikakulam Auto Accident: Vehicle Flips Over in Amadalavalasa, Passengers Injured Watch video


శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కొత్తకోట వారి వీధి సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆటో వేగంగా వెళుతూ అకస్మాత్తుగా నడి రోడ్డుపై బోల్తా పడింది. బోల్తా అంటే ఒక పక్కకి వదిగిపోవటం కాదు.. సినిమాల్లోని ఫైట్ సీన్‌లలో చూపించినట్టుగా ఏకంగా తలకిందులుగా అయిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఆటోలో చిక్కుకొన్న ప్రయాణికులు హాహాకారాలు చేసారు. వెంటనే స్థానికులు స్పందించి ఆటో కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో చిన్నారులు సైతం ఉన్నారు.

అందరినీ.. బయటకు తీసిన అనంతరం గాయపడిన వారిని ఆమదాలవలస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులతో ఆటో ఆమదాలవలస నుంచి సరుబుజ్జిల మండలం పురుషోత్తపురం వెళుతుoడగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక CC కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రమాద ఘటనపై ఆమదాలవలస పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

వీడియో చూడండి..

కాగా.. వేగంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. ఆటో డ్రైవర్లు, అలాగే అందరూ అప్రమత్తంగా వాహనాలను నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు అతివేగమే కారణమని ప్రాథమిక విచారణకు వచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *