Headlines

సామాన్యులపై మరో బండ.. పెరిగిన కూరగాయల ధరలు.. ఏయే ధరలు పెరిగాయంటే..? | Essential Commodities Price Hike: Rice, Onions and Vegetables Become Costlier


దేశంలో ఎల్‌నివో ప్రభావంతో కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఉల్లిపాయల నుంచి వంట నూనె వరకు వంటిల్లో ఉపయోగించే ప్రతీ వస్తువు ధర పెరుగుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలవారీ ఇంటి ఖర్చు పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఘర్షణ వాతావరణంతో సరుకు రవాణాలో అంతరాయం, దేశంలో పెట్రోల్, డీజిల్, ధరలు పెరగడంతో నిత్యావసర సరుకులపై ప్రభావం పడుతోంది. గత రెండు నెలల్లో దేశంలో నిత్యావసర సరుకుల ధరలు 5 నుంచి 45 శాతం వరకు పెరిగాయి. దీని వల్ల ఒక్కొ కుటుంబంపై రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. పెరిగిన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.

పెరిగిన బియ్యం ధరలు

దేశంలో ఎల్‌నివో ప్రభావం వల్ల పంట సాగు నిలిచిపోవడంతో బియ్యం ధరలు పెరిగాయి. 25 కిలోల బస్తా గతంలో రూ.1200కే లభించగా.. ఇప్పుడు రూ.2 వేల వరకు చేరుకున్నాయి. ఇక ఉల్లిపాయల ధరలు కూడా సెంచరీకి చేరువలో ఉన్నాయి. మొన్నటివరకు కిలో ఉల్లిపాయలు రూ.40కే లభించగా.. ఇప్పుడు రూ.80కి చేరుకున్నాయి. ఇక పంచదార ధరలు ఇటీవల పెరగ్గా.. ఇప్పుడు కాస్త అదుపులోకి వచ్చాయి. అలాగే అన్ని కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. పెద్ద చిక్కుళ్లు కిలో రూ.100కి చేరగా.. పచ్చిమిర్చి రూ.50కి చేరుకుంది. ఇక దోసకాయ, పొట్లకాయల ధరలు కూడా పెరిగాయి. అటు మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ధరలు కూడా పెరిగాయి. ఎల్‌నివో ప్రభావంతో వర్షాలు లేకపోవడం, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోవడంతో రైతుల పంట సాగు చేపట్టడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో క్రాప్ హాలీడే ప్రకటించారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కేవలం నదిపరివాహాక ప్రాంతాల్లో మాత్రమే నీటి సౌకర్యం ఉండటం వల్ల పంటలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కూరగాయల ధరలు ఇవే..

పెద్దచిక్కుళ్లు కిలో రూ.100 పలుకుతుండగా.. వంకాయ రూ.49, పచ్చిమిర్చి రూ.55, దోసకాయ రూ.36, క్యాప్చికం రూ.65, టమాటా రూ.33, బీరకాయ రూ.45, దొండకాయ రూ.30, బెండకాయ రూ.22, గొరుచిక్కుడు రూ.35, పొట్లకాయ రూ.23, క్యాబేజీ రూ.29గా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *