Headlines

DRDO Paid Internship 2026: డిగ్రీ విద్యార్ధులకు భలే ఛాన్స్.. డీఆర్‌డీఓ ఏరోనాటికల్‌ సిస్టమ్‌లో 200 పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లు | DRDO DG (AERO) Paid Internship 2026 Notification Released, Application link here


కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని డైరెక్టర్ జనరల్ (ఏరోనాటికల్ సిస్టమ్స్) ల్యాబ్‌లలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026-27 కింద అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్, సైన్స్ స్ట్రీమ్స్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 200 ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. ఎంపికైన వారు ADE, ADRDE, CABS, CEMILAC, GTREలలో ఇంటర్న్‌షిలకు అవకాశం లభిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 5, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. కేవలం 48 గంటల్లోనే 66 లక్షల ఇన్‌స్టా ఫాలోవర్లు!

ల్యాబ్‌ల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE), బెంగళూరులో ఖాళీలు: 69
  • సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (CABS), బెంగళూరులో ఖాళీలు: 60
  • గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE ), బెంగళూరులో ఖాళీలు: 31
  • ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADRDE ), ఆగ్రాలో ఖాళీలు: 20
  • సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్దినెస్ అండ్ సర్టిఫికేషన్ (CEMILAC), బెంగళూరులో ఖాళీలు: 20

డీఆర్‌డీఓ ఏరోనాటికల్‌ సిస్టమ్‌లో 200 పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లకు ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఇంజినీరింగ్, సైన్స్ విభాగాలలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ 2026-27లు.. సీఎస్‌ఈ/ఐటీ, ఏరో, మెకానికల్, ట్రిపుల్‌ఈ, ఈసీఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెటలార్జీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌ టెక్స్‌టైల్‌/పాలీమర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో అందిస్తున్నారు. ఇంజినీరింగ్ లేదా సైన్స్ స్ట్రీమ్‌కు చెందిన ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ (UG) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి కనీసం 6.5 సీజీపీఏ ఉండలి. యూజీ విద్యార్థులు 6వ సెమిస్టర్ మార్క్‌షీట్, పీజీ విద్యార్థులు 2వ సెమిస్టర్ మార్క్‌షీట్‌ను దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 25, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. పీజీ, యూజీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 6 నెలల పాట ఇంటర్న్‌షిప్‌ కొనసాగుతుంది. ఈ ఆరు నెలలకు రూ.30,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్ ఫార్మాట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలు నింపాలి. అనంతరం పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌పై విద్యార్థి, వారి కాలేజీ హెచ్ఓడి లేదా ప్రిన్సిపాల్ సంతకం చేసి, రెజ్యూమె, కాలేజీ పర్మిషన్ లెటర్, ఆధార్ కార్డ్ కాపీ, మార్క్‌షీట్స్ వంటి అవసరమైన సర్టిఫికెట్లను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సిద్ధం చేసుకుని దరఖాస్తు చేయాలనుకుంటున్న ల్యాబ్ అధికారిక ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ ల్యాబ్‌లకు చేయవచ్చు. అలాంటి వారు ఆయా మెయిల్‌ ఐడీలకు విడివిడిగా మెయిల్ పంపించవల్సి ఉంటుంది.

డీఆర్‌డీఓ ఏరోనాటికల్‌ సిస్టమ్‌లో 200 పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లకు ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *