Headlines

SBI Apprentice Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,150 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ గ్యారెంటీ | SBI Apprentice Recruitment 2026 Notification Out for 7,150 Vacancies, Apply Online


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌ల నియామకాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 7,150 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 709 పోస్టులు, తెలంగాణలో 491 పోస్టులు ఉన్నాయి.

బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర అధికారిక స్థానిక భాషలో ప్రావీణ్యం అంటే చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1998 నుంచి ఏప్రిల్‌ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు నిబంధనల మేరకు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తెఉ సమయంలో ఓసీ, బీసీ అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.300 తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటిస్‌గా కొనసాగవచ్చు. వీరికి ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. భవిష్యత్తులో ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ (క్లర్క్‌) నియామకాల్లో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. రాత పరీక్ష జులైలో ఉంటుంది.

ఎంపిక విధానం

ఆన్‌లైన్‌ రాత పరీక్ష మొత్తం 100 మార్కులు, 100 ప్రశ్నలకు ఉంటుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టుల్లో ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున 25 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన విభాగాలు ఇంగ్లిష్, హిందీతో పాటు అభ్యర్థి ఎంచుకున్న రాష్ట్ర ప్రాంతీయ భాషల్లో కూడా రాయవచ్చు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు అంటే 0.25 చొప్పున మార్కుల కోత ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి, వారికి స్థానిక భాషా ప్రావీణ్యం పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ 10వ తరగతి లేదా 12వ తరగతి మార్కుల జాబితాలో ఈ స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు ఆధారాలు చూపిస్తే వారికి ఈ భాషా పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు విధానం ఇలా..

అభ్యర్థులు ముందుగా అధికారిక ఎన్‌ఏపీఎస్‌ (NAPS) పోర్టల్ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in/web/careers లేదా sbi.bank.in/web/careers/current-openings ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ వెబ్ సైట్లలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు..

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *