Headlines

22ఏ బాధితులకు గుడ్ న్యూస్.. జాబితాలో ఉన్న ప్లాట్లు, ఇళ్లకు రిజిస్ట్రేషన్లు.. | Telangana Government Issues 7 Orders to Resolve Pending 22 A Land and Registration Issues, Applications to Be Cleared Within a Month


22-ఎ భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 22A సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 7 కీలక ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు పొంగులేటి. ప్రైవేటు భూములు అనుకోకుండా 22-ఎ జాబితాలో చేరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరిస్తున్నామన్నారు. 10 నుంచి 12 రకాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి జి.ఓ 118, జి.ఓ 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.

జి.ఓ 59 పరిధిలోని 500 చదరపు గజాల లోపు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలతో కూడిన మెమో నెం. 48030ని జారీ చేసినట్లు తెలిసింది. గతంలో జరిగిన అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా, పూర్తిగా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో అక్రమంగా పొందిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా రీ-వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది.

22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, ఇతర మున్సిపల్ అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్ చిక్కులకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వం తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *