Headlines

Video: వామ్మో.. అంత పెద్ద పామా.. తిరుమలలో భయపెట్టిన జెర్రిపోతు.. వీడియో చూస్తే.. | 9 Foot Snake Spotted at Tirumala Srinivasa Gardens, Watch Viral Video


ఏడుకొండలవాడి చెంత తీవ్రమైన ఎండలు అటవీ జీవులను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు తాళలేక శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. చల్లని ప్రాంతాల కోసం వెతుకులాటలో భాగంగా ఇవి అప్పుడప్పుడూ భక్తులను, స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా తిరుమలలోని ప్రసిద్ధ శ్రీనివాస గార్డెన్స్‌‌లో ఒక భారీ పాము కలకలం సృష్టించింది. పార్కులో సిబ్బంది రోజువారీ పనులు చేసుకుంటుండగా, పొదల్లో ఒక్కసారిగా 9 అడుగుల భారీ జెర్రిపోతు ప్రత్యక్షమైంది. కంటికి ఎదురుగా అంత పెద్ద పాము కనిపించడంతో గార్డెన్ సిబ్బంది షాక్‌కు గురై, భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు

సమాచారం అందిన వెంటనే టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడు వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంత పెద్ద పాము ఉన్నప్పటికీ, ఆయన ఏమాత్రం బెదరకుండా ఎంతో చాకచక్యంగా, నిమిషాల వ్యవధిలోనే ఆ 9 అడుగుల జెర్రిపోతును బంధించారు. ఆ తర్వాత ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా, సురక్షితంగా తీసుకెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో అటు అటవీ సిబ్బంది, ఇటు గార్డెన్ సందర్శనకు వచ్చిన భక్తులు పెద్ద గండం గడిచిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి బాబోయ్ ఎంత పెద్ద పాము అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *