Headlines

Video: ఐపీఎల్ మ్యాచ్‌లో ఊహించని సీన్.. చీర్‌లీడర్‌‌కు చీటి విసిరిన ఫ్యాన్.. కట్‌చేస్తే.. | Ipl 2026 pbks vs lsg cheerleader harassment video viral ekana stadium lucknow


PBKS vs LSG Cheerleader Harassment: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) రసవత్తర పోరు ముగింపు దశకు చేరుకున్న వేళ లక్నో వేదికగా ఒక సిగ్గుచేటు సంఘటన వెలుగుచూసింది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కొందరు ఆకతాయిలు పరిధులు దాటారు. స్టేడియంలో డ్యాన్స్ చేస్తున్న ఒక విదేశీ చీర్‌లీడర్‌పై కాగితంపై మొబైల్ నంబర్ రాసి విసిరి, తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మైదానంలో పంజాబ్ గెలుపు.. గ్యాలరీలో మాత్రం అవమానం..!

లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఇటానా క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు అద్భుత విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, మైదానంలో ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపిస్తుంటే, గ్యాలరీలో ఉన్న కొందరు ప్రేక్షకులు మాత్రం క్రీడా స్ఫూర్తిని మంటగలిపారు. బౌండరీ లైన్ సమీపంలో తమ జట్టును ఉత్సాహపరుస్తున్న చీర్‌లీడర్ల పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..

ఫోన్ నంబర్ రాసి.. వెనుక నుంచి విసిరి..!

అసలు ఏం జరిగిందంటే, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడు కాగితం ముక్కపై తన మొబైల్ నంబర్ రాసి, బౌండరీ లైన్ పక్కనే ఉన్న చీర్‌లీడర్‌పైకి విసిరాడు. ఆ కాగితం ఆమెకు బలంగా తగలడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకు లోనైన ఆ యువతి.. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని, తమను గౌరవించాలని అక్కడున్న అభిమానులను వేడుకుంది. వినోదాన్ని పంచేందుకు వచ్చే మహిళలపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంపై క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లో మరో కొత్త ఫ్రాంచైజీ.. ఒకే టీంలోకి ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ? రంగంలోకి భారతీయ బిలియనీర్!

రంగంలోకి దిగిన మహిళా పోలీసులు..

చీర్‌లీడర్‌ పట్ల ఆకతాయిల ప్రవర్తన మితిమీరడంతో స్టేడియంలో ఉన్న తోటి ప్రేక్షకులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. పరిస్థితి చేయి దాటకముందే లక్నో పోలీసులు, ముఖ్యంగా మహిళా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితురాలికి రక్షణగా నిలిచి, గొడవకు కారణమైన ఆకతాయిలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి నెట్టింట పెట్టడంతో, ఐపీఎల్ యాజమాన్యం స్టేడియాల్లో మహిళల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

మ్యాచ్ ఎలా సాగిందంటే..?

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (72) హాఫ్ సెంచరీతో రాణించగా, ఆయుష్ బదోని (43), రిషబ్ పంత్ (26) మెరుపులు మెరిపించారు.

ఇది కూడా చదవండి: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి..? వీరిద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే అవాక్కే..

అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 101 పరుగులతో అజేయ సెంచరీతో జట్టును ముందుండి నడిపించగా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 69 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *