APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం శానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచనుంది. త్వరలోనే దీనిని అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచాలన ఏఫీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖపై రవాణశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాయపాటి…
