Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా… | Thieves Dig Hole Through Wall, Rob Jewellery Showroom in Vinukonda
మూడేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండ దక్షిణ బజార్లో రాహుల్ రెడ్డి, వెంకట శివరెడ్డి కలిసి బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నెలల క్రితం వ్యాపారాన్ని విస్తరించి “వేక్షిత జ్యూయలర్స్” పేరుతో ఆధునిక షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం రాత్రి షాపును మూసివేసి యజమానులు ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం షాపుకు వచ్చి చూడగా, షట్టర్ యథావిధిగా మూసి ఉన్నప్పటికీ లోపల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు…
