Headlines

Yuvva Kumarr Miriyala

బాబోయ్ అంత పెద్దదా? నల్లమల అడవుల్లో 300 ఏళ్ల నాటి ఊడలమర్రి.. చెట్టు కింద చీమల్లా మనుషులు! | A 300 Year Old Giant Banyan Tree in Nallamala Forest Leaves Visitors Amazed

దట్టమైన నల్లమల అడవుల్లోని పాలుట్ల గ్రామంలో వెలుగుచూసిన ఒక భారీ ఊడలమర్రి చెట్టు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పురావస్తు శాఖ అధికారులు నల్లమలలో చారిత్రక సంపద కోసం సర్వే చేస్తుండగా ఈ వృక్షరాజం ప్రాధాన్యత వెలుగులోకి వచ్చింది. ప్రకృతి వారసత్వానికి సజీవసాక్ష్యంగా నిలుస్తోంది ఈ మహా వృక్షం. స్థానిక గిరిజనుల ప్రకారం, వారి ఏడు తరాల పూర్వీకుల నుండి దాదాపు రెండు-మూడు వందల ఏళ్లుగా ఈ చెట్టు ఇక్కడే ఉందని తెలిసింది.. ఈ వృక్షం కింద గ్రామదేవతను…

Read More

Andhra Pradesh: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటలో కనిపించిన రెండు బొమ్మలు.. అసలు కథ ఏంటంటే..? | Twist in Tuni Girl Jahnavi Missing Case: Mysterious Dolls Appear in Palm Oil Plantation..

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ప్రాంతంలో గత 11 రోజులుగా అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జాహ్నవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తాజాగా పాప తప్పిపోయిన ప్రాంతంలో రెండు బొమ్మలు ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జాహ్నవి అదృశ్యమైన పామాయిల్ తోటలోని పొలం కంచెకు ఈ రెండు బొమ్మలను వేలాడదీసినట్లు గుర్తించారు. అయితే దీనిపై తుని రూరల్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేస్ సీన్…

Read More

AP Govt Jobs 2026: రాత పరీక్షలేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. నెలకు రూ.1.10 లక్షల జీతం | AP Health Department Recruitment Notification 2026: 23 Civil Assistant Surgeon Specialist and General Posts in Prakasam District

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రకాశం జిల్లాలోని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు 16, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టులు 7 వరకు ఉన్నాయి. ఎలాటి రాత పరీక్ష…

Read More

DSSSB Teacher Jobs 2026: డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1.42 లక్షల వరకు జీతం | DSSSB Recruitment 2026 Notification Out For 1979 Teaching Non Teaching Posts, Check full details

ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1979 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 675 ఖాళీలకు డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎడ్‌లతో అవకాశం ఉంది. సాధారణంగా టీచర్‌ ఉద్యోగాలకు డీఎడ్‌ లేదా బీఎడ్‌ తప్పనిసరిగా ఉండాలి. కానీ కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్లకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. దీంతో…

Read More

Pawan Kalyan: వస్తున్నా నిరంజన్.. అభిమాని కోరిక తీర్చేందుకు ఓరుగల్లుకు పవన్ కళ్యాణ్.. | Pawan Kalyan to Visit Hanumakonda Warangal to Meet Young Fan Battling a Chronic Illness

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఓరుగల్లుకు రాబోతున్నారు.. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ ను పరామర్శించడానికి వస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా భావిస్తున్న ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో పవన్ కళ్యాణ్ గడుపుతారు.. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గాలి బుడగ…

Read More

సరదా కోసం వెళ్లి శాశ్వతంగా దూరమయ్యాడు.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి | Kurnool Youth Dies in Tragic Plane Crash in the US

కర్నూలు, జూన్‌ 17: అమెరికాలో జూన్‌ 15న జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం తుంబిగనూరు గ్రామానికి చెందిన దాట్ల సుబ్రహ్మణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ( 26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దాట్ల సుబ్రహ్మణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం. కాగా 30ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఏకైక కుమారుడు సాయి కార్తీక్ వర్మ సంతానం….

Read More

Thalliki Vandanam: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే! | AP Govt Plans to Launch Thalliki Vandanam Scheme in June Third Week

ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోపే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఓపెన్ కావడంతో ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి త్వరితగతిన ఆర్థికసాయం అందేలా చూడాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి లోకేష్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మంత్రి లోకేష్ ఉన్నతాధికారుల సమీక్ష ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

Read More

నాన్‌వెజ్ ప్రియులకు బిగ్‌ అలర్ట్.. షాప్‌లో మటన్ కొంటున్నారా?.. ఆగండి.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

టెంపుల్ సిటీ తిరుపతిలో భారీ మటన్ మాఫియా దందా వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపించారు. నగరంలోని పిపి చావిడి మటన్ మార్కెట్‌లో మున్సిపల్ అధికారులు బుధవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు మటన్ మార్కెట్‌ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు….

Read More

Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే! | Tirupati Cash Doubling Scam: Realtor Duped of Rs 14 Lakh in ‘1 For 3’ Fraud; Police Launch Hunt

రూపాయికి 3 రూపాయలు ఇస్తామంటూ ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.14లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లో కెళ్తే.. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవి చంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇటీవలే చిల్లకూరుకు చెందిన శ్రీనివాసుస్‌, జీవకోనకు చెందిన గుణశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్ళ మధ్య పరిచయంలో బ్లాక్ మనీ, రైస్ పుల్లింగ్ వ్యవహారాలు తరచూ చర్చకు రాగా తిరుపతికి చెందిన లక్ష్మీ…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం బిగ్ అప్డేట్.. | Andhra pradesh Government to Approve 2.2 Lakh New Widow Pensions; Beneficiaries to Receive 4000 Monthly

ఏపీలో కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్నవారిలో కొత్తగా వితంతు పింఛన్ల కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెండు నెలల్లో వీటికి పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే పించన్ల పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం…

Read More