Headlines

ట్రైన్‌లో మిస్సై.. అడవీలో శవమై కనిపించిన అస్సాం యువతి.. అ రాత్రి అసలు ఏం జరిగింది? | Mysterious Death: Assam Student Missing on Train from Visakhapatnam Found in AP Forest


డ్యాన్స్ కాపింటీషన్‌ కోసమని విశాఖపట్నం వచ్చి.. గౌహతికి రైలులో ప్రయాణిస్తూ అదృశ్యమైన అస్సాంకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఏపీలోనే శవమై కనిపించింది. మలయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన రైల్వే అధికారులు.. బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని కామరూప్ జిల్లా చపైడాంగ్ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి.. గౌహతిలోని బి. బోరూవా కాలేజ్‌లో చదువుతోంది. అయితే తాజాగా ఓ డ్యాన్స్ కాంపిటేషన్‌లో పాల్గొనేందుకు ఆమె విశాఖపట్నం వచ్చింది. అయితే పోటీలు ముగిసిన తర్వాత ఆమె తిరిగి గౌహతి వెళ్లేందుకు అక్టోబర్ 5వ తేదీ రాత్రి 11:50 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. కానీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9:05 గంటలకు గౌహతి చేరుకోవాల్సిన ఆమె.. గమ్యానికి చేరుకోలేదు.. మధ్యలోనే ఆమె అదృశ్యమైంది.

అయితే అక్టోబర్ 6న మంగళవారం తెల్లవారుజామున 2:39 సమయంతో కూతురు తమకు ఫోన్ చేసి.. తన చూట్టూ చాలా మంది యువకులు ఉన్నారని.. తనకు చాలా భయంగా ఉందని చెప్పినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వాళ్లు వెంటనే గౌహతిలోని ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఇక బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే ఆమె ప్రయాణించిన దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్ 2 కోచ్‌లో పోలీసులకు ఆమె బ్యాగ్‌ దొరికింది. కానీ ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో గాలింపు చర్మలను ముమ్మరం చేసిన పోలీసులు.. చివరకు ఏపీలోని మలయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో యువతి మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతికి గల కారణాలును తెలుసుకునేందు దర్యాప్తును వేగవంతం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *