Headlines

బతుకమ్మ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: టీవీ9 యాంకర్ దీప్తి వాజపేయి | Bathukamma Celebrations in Hyderabad: TV9 Anchor Deepti Vajpayee Unveils Poster


హైదరాబాద్: సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ టీవీ9 యాంకర్ దీప్తి వాజపేయి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో సంస్కార భారతి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జమాలపురి నిరంజన్, స్టేట్ మాతృశక్తి కోకన్వీనర్ శాలిని, రంగోలి ప్రముఖ్ జయశ్రీ, గ్రేటర్ భాగ్యనగర్ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయలక్ష్మి, జిల్లా జనరల్ సెక్రటరీ అనంత లక్ష్మి, కిరణ్మయి, సుధీర్‌తో పాటు సంస్కార భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.

బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెప్పడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లో మరింతగా విస్తరించేందుకు సంస్కార భారతి చేపడుతున్న కార్యక్రమాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. కాగా, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *