Headlines

వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం.. | Poor Veda Student Denied Entry Over rs 8,000 Fine; Parents Seek Justice video tv9d


పవిత్రమైన వేదపాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధులకు వేదం, చదువు, సంస్కారం నేర్పించాల్సిన వేదపాఠశాలో కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ ఓ పేద విద్యార్ధిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం వేద పాఠశాలలో రాజమండ్రికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్న తర్వాత పాఠశాలకు తిరిగి రావడంలో ఎనిమిది రోజులు ఆలస్యమైంది. అనారోగ్యం కారణంగా ఆలస్యమైందని తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా యాజమాన్యం కనికరించలేదు. పైగా రోజుకు వెయ్యి రూపాయల చొప్పున ఏకంగా రూ. 8,000 జరిమానా విధించింది. “ఆ ఎనిమిది వేల రూపాయలు కడితేనే లోపలికి రానిస్తాం, లేదంటే గేటు బయటే నిలబడండి” అంటూ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా బాలుడిని, అతని తల్లిదండ్రులను తిరస్కరించింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద తల్లిదండ్రులు అంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా కట్టలేక, తమ బిడ్డ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని పాఠశాల గేటు ముందే కన్నీరుమున్నీరవుతున్నారు. అనారోగ్యం కారణంగా సమయానికి పాఠశాలకు రాలేకపోయిన ఆ నిరుపేద విద్యార్థికి వేసిన జరిమానా విషయంలో వేద పాఠశాల నిర్వాహకులు కాస్త ఉదారంగా వ్యవహరించాలని ఈ సన్నివేశాన్ని చూసిన వారు విజ్ఞప్తి చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఆ బాలుడికి న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన

వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!

రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *