Headlines

కోవూరులో ఘనంగా ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నేతల పిలుపు

Jansena kovur, gadiraju jeevan Krishna,janasainiks kovur

​నెల్లూరు: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. కోవూరు మండలం పడుగుపాడులో వెలిశెట్టి తనుష్ చంద్ర, ముక్కోటి అమరనాధ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ మరియు జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్ నక్కల శివకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలపై ఆత్మీయ చర్చలు జరిపారు.

​పార్టీ బలోపేతానికి అందరి కృషి అవసరం:
ఈ సందర్భంగా జీవన్ కృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమానికి జనసైనికుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముక్కోటి అమరనాధ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో జీవన్ కృష్ణ వంటి సమర్థవంతమైన నాయకుడు అందుబాటులో ఉన్నారని, ఆయన నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

Oplus_16908288

​ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం ఐటీ ఇంచార్జ్ చెరుకూరు దిలీప్, సత్య కృష్ణ ప్రసాద్, పిల్లేలా సురేంద్ర, వేణు శరన్, గిలక ప్రవీణ్, దండూరు కళ్యాణ్, ఇమ్రాన్, గుంజి రవీంద్రలతో పాటు భారీ సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *