ప్రేమ కోసం కన్నవారి ఇంటికే కన్నం.. ప్రియుడితో కలిసి తండ్రిని లూటీ చేసిన కూతురు! | Uttar pradesh: high profile robbery in brass trader house expose in moradabad, daughter and her lover arrested
సంచలనం సృష్టించిన రూ. 1.3 కోట్ల భారీ దోపిడీ కేసును ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. నాగఫణి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హైప్రొఫైల్ క్రైమ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఇత్తడి వ్యాపారి సొంత కుమార్తె అని తేలడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ప్రియుడితో కలిసి ఆమె ఈ వికృత కుట్రకు తెరలేపినట్లు విచారణలో వెల్లడైంది. మే 11వ తేదీ రాత్రి, మొరాదాబాద్ జిల్లాలోని నాగఫణి పోలీస్ స్టేషన్…
