Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..
వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ యువకుడికి దేహశుద్ధి చేసి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగించారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్ల్ గ్రామంలో అవమానకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు భాస్కర్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా యువకుడు భాస్కర్ కు అరగుండు కొట్టించి మెడలో చెప్పులు దండ వేసి ఊళ్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో నడిపించుకుంటూ యువకుడు భాస్కర్ ను…
