పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు! | Ancient Durga Devi Idol Unearthed During Excavation in Tirupati District video tv9d – Viral Videos in Telugu
అచంచలమైన దైవలీలలు ఎప్పుడు, ఏ రూపంలో వ్యక్తమవుతాయో చెప్పలేం. తిరుపతి జిల్లా పాకాల మండలంలో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుత ఘటనే చోటుచేసుకుంది. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులకు సాక్షాత్తూ ఆ జగన్మాత దుర్గాదేవి పురాతన విగ్రహ రూపంలో సాక్షాత్కరించింది. పాకాల మండలంలోని ఇరంగారిపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలాన్ని చదును చేస్తూ, చుట్టూ కంచె వేయడం కోసం జేసీబీతో తవ్వకాలు జరిపిస్తున్నారు. ఆ సమయంలో జేసీబీ బకెట్‌కు ఏదో బలంగా అడ్డుపడింది. అనుమానంతో…
