Andhra: ఏపీలో బుధవారం వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి.. | Thunderstorms Likely Across Andhra Pradesh on June 17; People Advised to Stay Alert
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం (జూన్ 17) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,…
